రాజ్యాంగ సవరణ చేయాలి

02-10-2026 | 05:20am
  1. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు బాధాకరం
  2. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి
  3. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య(MP R. Krishnaiah) అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీసీలకు జనా భా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు