మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రెండు రోజుల ఎండీపీ
పటాన్ చెరు, నవంబర్ 2: వ్యూహాత్మక వ్యాపార నిర్ణయాలు(Strategic Business Decisions) తీసుకోవడంలో మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానం పెంపొందించేందుకు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో(GITAM School of Business) ఈనెల 19, 20 తేదీల్లో రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమం(Management Development Programme) (ఎండీపీ) నిర్వహించనున్నారు. ‘సంఖ్యల నుంచి వ్యూహం వరకు’ అనే ఇతివృత్తంతో హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆర్థిక విశ్లేషణ, బడ్జెట్ రూపకల్పన, పెట్టుబడుల మదింపు, వ్యయ నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు.
ముఖ్యంగా ఫైనాన్స్‌లో అనుభవం లేని మేనేజర్లు, వృత్తి నిపుణులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గీతం అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగానికి చెందిన డాక్టర్ సుశోభన్ పాల్, డాక్టర్ మెరుగు వేణుగోపాల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాల్గొన్నవారికి అభ్యాస సామగ్రితో పాటు సర్టిఫికెట్ అందజేస్తారు. ఆసక్తి ఉన్నవారు వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం 84209 66501 నంబర్‌ను సంప్రదించవచ్చు. లేదా cbe@gitam.eduకు మెయిల్ చేయవచ్చు.