రాధమ్మాస్ హౌస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ప్రారంభం
ఎల్బీనగర్, నవంబర్ 23 : ఆర్కేపురం డివిజన్(Arkepuram Division) స్నేహపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రాధమ్మాస్ హౌస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ను సోమవారం కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక మధురాఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత వస్త్రాలు ప్రతీకలని, చేనేత రంగానికి ప్రోత్సాహం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
సంప్రదాయ చేనేత కళను ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో రాధమ్మాస్ హౌస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. చేనేత కార్మికులకు చేయూతనిస్తూ, మహిళలకు నాణ్యమైన చేనేత వస్త్రాలు, ఆకర్షణీయమైన చీరలను అందించాలనే సంస్థ యాజమాన్యం సంకల్పం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాధమ్మాస్ హౌస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ యజమానురాలు సింగిరెడ్డి మాధవి రెడ్డి, కుటుంబ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.