వచ్చే జూన్ వరకు యాక్షన్ ప్లాన్ ఉండాలి
- ‘ఎల్ నినో’ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి
- తాగు, సాగునీటి ఎద్దడి రానివ్వొద్దు
- విద్యుత్ కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేదే లేదు
- ఎల్ నినోపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్తులో తాగు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంపై శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.
ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటినుంచి వచ్చే జూన్ వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమా దం ఉందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా డిమాండ్ మేరకు విద్యుత్‌ను కొను గోలు చేసేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడేదే లేదని స్పష్టం చేశారు.
ప్రస్తు తం మార్కెట్‌లో విద్యుత్ లభ్యత అందుబాటు లో లేకపోవడం సవాలుగా మారిందన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా విని యోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ ఆధారిత పనులను సాధ్య మైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చుక్క నీరు వృథా కావొద్దు..
భవిష్యత్తులో తాగు, సాగునీటి ఇబ్బందు లు తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. నీటి వనరుల వినియో గం, నీటి పొదుపుపై ప్రత్యేక కార్యాచరణ రూ పొందించాలని సూచించారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎల్ నినో, నీటి పొదుపు ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అవగాహన కల్పించేందుకు సినిమా,
మీడియా, కళాజాతలతో పాటు వివిధ ప్రచార మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఉన్నతస్థాయి సమీక్షలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.