ఆడబిడ్డకు ఆర్థిక భరోసా
12-09-2026 | 06:18pm
హత్నూర: ఆడపిల్ల పుట్టుకను ప్రోత్సహిస్తూ హత్నూర మండలం(Hathnoora Mandal) నస్తీపూర్‌లో ‘ఆడపిల్ల పుడితే ఊరంతా పండుగే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలుగు గ్రామైక్య సంఘం(Velugu Gramaikya Sangam) ఆధ్వర్యంలో ఇటీవల జన్మించిన ఆడశిశువుల తల్లులకు నూతన వస్త్రాలు అందజేయడంతో పాటు, ప్రతి పాప పేరుతో సుకన్య సమృద్ధి యోజన(Sukanya Samriddhi Yojana) ఖాతాలో రూ.1,000 చొప్పున జమ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలకొండ ప్రమీల సాయిలు మాట్లాడుతూ.. ఆడపిల్లలను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని, వారికి విద్యతో పాటు అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామైక్య సంఘం ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు