సామెల్ కుటుంబానికి చంద్రశేఖర్‌రెడ్డి పరామర్శ
01-10-2026 | 08:25pm
నాగల్గిద్ద, అక్టోబర్ 1 : నాగల్గిద్ద మండలం వల్లూర్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ సామెల్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డి(DCC President Chandrashekar Reddy) ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సామెల్ స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, మాజీ సర్పంచ్ సంజీవ్ పాటిల్, ప్రదీప్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.