కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి (విజయ క్రాంతి): గ్రామాలు ,పట్టణాలు మహిళల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యపడుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో సోమవారం ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో అంచనా విలువ 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్, అంచనా విలువ 10 లక్షల రూపాయలతో నూతన గ్రామ మహిళ సమైక్య(VO"S Building) భవన నిర్మాణముల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి ప్రజాపాలల్లో భాగంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సిసి రోడ్లు, డ్రైనేజీ, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, స్మార్ట్ కార్డు పంపిణీ, మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మహిళా భవనాలు, మహిళల అభివృద్ధి కోసం ఆర్టీసీ బస్సులు పంపిణీ, పేదల వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్, 100 పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏర్పాటు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కొనియాడారు. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు, సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కట్టమల్లారెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు వివేక్ రెడ్డి. లింగయ్య, తదితర నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.