నల్లవాగు ఆయకట్టును పరిశీలించిన ఎమ్మెల్యే

18-10-2026 | 05:14pm

సిర్గాపూర్ సెప్టెంబర్ 18(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు(Nallavagu Project) నుంచి సాగునీటి కాలువలకు(Irrigation canal) నీటి విడుదలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Dr. Patlolla Sanjeeva Reddy) ఆదివారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా సాగునీటి సరఫరా(Irrigation water supply) తీరును పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు(Farmers') నీరు అందుతున్న విధానంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులతో...మాట్లాడుతూ నల్లవాగు ప్రాజెక్టు నీరు చివరి ఆయకట్టు వరకు ఉన్న ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అధికారులు స్వయంగా కాలువల వెంట పర్యటిస్తూ నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, మధ్యలో ఎవరూ అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న రైతులు తమ పంటలకు అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని, మిగిలిన నీటిని కాలువల ద్వారా ముందున్న గ్రామాలకు, చివరి ఆయకట్టులోని రైతులకు చేరేలా సహకరించాలని ఎమ్మెల్యే  విజ్ఞప్తి చేశారు. సాగునీరు కొందరికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల రైతులకు సమానంగా అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు