గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం

13-11-2026 | 10:32pm

భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

నారాయణఖేడ్, నవంబర్ 13 (విజయక్రాంతి): నారాయణఖేడ్(Narayankhed) పట్టణం నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే వార్షిక మహా పాదయాత్ర కరణ్ భారతి మహారాజ్(Karan Bharati Maharaj) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో(devotional) ప్రారంభమైంది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(Patlolla Sanjeeva Reddy) భక్తులతో(devotees) కలిసి పాదయాత్రలో పాల్గొని కొంతదూరం నడిచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావాన్ని, ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న భక్తులందరికీ శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, భక్తులంతా క్షేమంగా గనుగాపూర్ చేరుకుని స్వామివారిని దర్శించుకుని సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు