చెత్త సమస్యకు చెక్.. రంగంలోకి ఆధునిక వాహనాలు

02-11-2026 | 11:55am

పటాన్‌చెరు, నవంబర్ 2 (విజయక్రాంతి): పటాన్‌చెరు నియోజకవర్గంలో పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తోషిబా పరిశ్రమ అందించిన రూ.12 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో 10 స్వీపింగ్ మిషన్లు, 10 టిప్పర్లను కొనుగోలు చేశారు.

పటాన్‌చెరు మైత్రి మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్, తోషిబా పరిశ్రమ ప్రతినిధులు తొలి విడతగా ఐదు స్వీపింగ్ మిషన్లు, ఐదు టిప్పర్లను ప్రారంభించారు (Launched). వీటిని పటాన్‌చెరు, అమీన్‌పూర్ సర్కిళ్ల పరిధిలో పారిశుధ్య సేవలకు వినియోగించనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి డివిజన్‌కు స్వీపింగ్ మిషన్, టిప్పర్‌తో పాటు జేసీబీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బందిని తక్షణమే నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు