మురసు ముప్పు

02-11-2026 | 05:25am
  1. తెలంగాణపై మరో తుఫాను ప్రభావం
  2. ఈ నెల 6 వరకు రాష్ట్రంలో వర్షాలు
  3. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): మురసు రూపంలో మరో తుఫాన్(Cyclone Murasu) దూసుకొస్తుంది. బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా బలపడి తుఫాన్‌గా మార నుంది. దీనిప్రభావం ఏపీతోపాటు తెలంగాణపై కూడా పడనుంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological department officials) అంచానా వేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. సోమవారం ఉమ్మడి వరంగల్, నల్లగొండ, సిద్దిపేట, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. 30 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

మంగళవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. 

మురసు అంటే..

ఈ తుఫాన్‌ను మురుసుగా అధికారులు నామకరణం చేశారు. గత అర్నబ్ తుఫాన్‌కు బంగ్లాదేశం నామకరణం చేయగా.. ఈ మురసు తుఫాన్‌కు భారత్ నామకరణం చేసింది. ఇది ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో తుఫాను. మురాస్ అంటే పూర్తి అర్థం యుద్ధ భేరీ అని వస్తుంది. అలాగే దీనికి తమిళంలో ఢంకా అని అర్థం. ప్రాచీన కాలంలో ఏదైనా ప్రకృతి విపత్తులు లేదా ప్రమాదాలు ముంచుకొస్తున్నప్పుడు ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడానికి, వేగంగా సమాచారాన్ని చేరవేసేందుకు ఈ ఢంకా (డప్పును) వాయించేవారు.

విపత్తు హెచ్చరికకు ఇది ఒక చారిత్రక ప్రతీక కావడంతో భారతదేశం ఈ పేరును సూచించడం విశేషం. అదేవిధంగా ప్రపంచ వాతావరణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలు ముందుగానే తుఫాన్లకు పేర్లను సూచిస్తాయి. ప్రస్తుతం రాబోతున్న ‘మురసు’ తర్వాత భవిష్యత్తులో ఏర్పడే తుఫాన్లకు వివిధ దేశాలు ముందుగానే పేర్లను సూచించాయి. 

రాబోయే తుఫాన్ల పేర్లు

ఇరాన్ మాల్దీవులు మయన్మార్ ఒమన్ పాకిస్థాన్ ఖతార్ సౌదీ అరేబియా

మరిన్ని వార్తలు