గజ్వేల్ డాక్టర్ సునందకు బంగారు పతకం

13-10-2026 | 04:58pm

ఈఎన్‌టీ పీజీలో రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు

గజ్వేల్, అక్టోబర్ 13: గజ్వేల్‌కు చెందిన డాక్టర్ గుడ్డోజు సునంద సత్తా చాటారు. కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం(Kaloji Narayana Rao University) ప్రకటించిన పీజీ ఫలితాల్లో చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స విభాగంలో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ ర్యాంకుతో బంగారు పతకం కైవసం చేసుకున్నారు.

సునంద  ఎంబీబీఎస్‌ను ఎల్బీనగర్‌లోని కామినేని మెడికల్ కాలేజీలో, ఈఎన్‌టీ పీజీని మొయినాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. గజ్వేల్ నుంచి తొలి ఎంఎస్‌- ఈఎన్‌టీ వైద్యురాలిగా నిలవడం గర్వంగా ఉందని తండ్రి కృష్ణమూర్తి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యను అభ్యసించి, ప్రాంతంలోని పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని డాక్టర్ సునంద తెలిపారు.

మరిన్ని వార్తలు