ప్రజల హృదయాల్లో పదిలంగా నిలిచేది చేసిన సేవలే!

10-10-2026 | 05:06pm

గజ్వేల్, అక్టోబర్ 10: ప్రజా ప్రతినిధిగా(Public Representative) ప్రజలకు చేసిన సేవలే వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి(Former Gajwel MLA Toomkunta Narsa Reddy) అన్నారు. ములుగు మాజీ సర్పంచ్ దివంగత చింతకింది బాలమ్మ 17వ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి, బట్టు అంజిరెడ్డి తదితర ప్రముఖులు బాలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌గా బాలమ్మ గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.

పారిశుధ్యం, తాగునీటి సమస్యల(Sanitation and drinking water issues) పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. విద్యుత్ దీపాలు, సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంలో(Construction of streetlights, CC roads, and drainage canals.) ఆమె సేవలు మరువలేనివన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు బాలమ్మ సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగుళ్ల కనకయ్య, బాగనోళ్ల విజయమోహన్, జహంగీర్, కడపల్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు బాలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు