మహిళా భజన బృందాలకు ఐడీ కార్డుల పంపిణీ
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన మూడు మహిళా భజన బృందాలకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొంగల రాంరెడ్డి ఆధ్వర్యంలో ఐడీ కార్డుల (ID Cards) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దొంగల రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన మహిళా భజన కమిటీలు (Bhajan Committees) ఏర్పాటు చేసి, మహిళలను ఆధ్యాత్మికత వైపు ప్రోత్సహించాలని కోరారు. మహిళల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు భజన బృందాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మీరుదొడ్డి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షుడు మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మహిళా భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం (Programme) మహిళా భజన బృందాలను ప్రోత్సహించే దిశగా నిర్వహించారు