అండర్ 19 జట్టులో మార్పులు
రోహిత్ యాదవ్ స్థానంలో ఆర్యన్ సవ్సానీ
ముంబై, సెప్టెంబర్ 8: ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన భారత అండర్-19 జట్టు(India Under-19 team)లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. వయసు ధ్రువీకరణ పత్రాల్లో తేడాలు వెలుగుచూడటంతో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో సిరీస్కు ఎంపికైన యువ స్పిన్నర్ రోహిత్ యా దవ్ను భారత అండర్-19 జట్టు నుంచి బీసీసీఐ తొలగించింది. అతని స్థానంలో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది.
వన్డే జట్టుకు సంబంధించి రోహిత్ యాదవ్ స్థానంలో సౌరాష్ట్ర ఆటగాడు ఆర్యన్ సవ్సానీని ఎంపిక చేశారు. లక్ష్శ్య రైచందానీ ఈ వన్డే జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మల్టీ-డే జట్టులో హర్యానాకు చెందిన తన్మయ్ బలోడా భర్తీ చేయనున్నారు. యశ్వర్ధన్ చౌహాన్ నాయకత్వంలోని జట్టులో తన్మయ్ కు అవకాశం దక్కింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, బీసీసీఐ వయస్సు- నిర్ధారణ విభాగం నిర్వహించిన పరిశీలనలో రోహిత్ యాదవ్ వయసు మోసం వెలుగు చూసిం ది.రోహిత్ యాద్ప బీసీసీఐ రెండేళ్లపాటు నిషేధం విధించింది.