రెన్షా వీరోచిత సెంచరీ
- ఆసీస్ 390 ఆలౌట్
- సౌతాఫ్రికాతో తొలి టెస్ట్
డర్బన్, అక్టోబర్ 10 : సౌతాఫ్రికాతో(South Africa) జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia ) అద్భుతంగా పుంజుకుంది. తొలిరోజు 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడి న ఆ జట్టు రెన్షా వీరోచిత సెంచరీతో భారీస్కోరు సాధించింది. రెండోరోజు ఆటలో రెన్షా ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది. సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఆసీస్ బ్యాటర్ టెయిలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కెప్టెన్ కమ్మిన్స్‌తో కలిసి 86 పరుగులు జోడించా డు.
కమ్మిన్స్ (43) ఔటైన తర్వాత నాథన్ ల్యాన్ చక్కని సహకారమందించాడు. ల్యాన్(27)తో కలిసి రికార్డు స్థాయిలో 9వ వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెన్షా, టెయిలెండర్ల పోరాటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా 1 వికెట్ కోల్పోయి 27 పరుగులు చేసింది.