మైక్ హస్సీకి సీఎస్కే గుడ్ బై

11-10-2026 | 05:20am
  1. 18 ఏళ్ల బంధానికి ముగింపు
  2. బౌలింగ్ కోచ్ సిమన్స్‌పైనా వేటు

చెన్నై, అక్టోబర్ 10 : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ లో(Chennai Super Kings franchise) సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హెడ్ కోచ్‌గా జహీర్‌ఖా న్‌ను నియమించుకున్న సీఎస్కే ఇప్పుడు సపోర్టింగ్ స్టాఫ్‌లో ప్రక్షాళన చేపట్టింది. దీని లో భాగంగా బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీతో బంధానికి ముగింపు పలికింది. హస్సీ దాదా పు 18 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో కలిసే ఉన్నాడు.

ఆటగాడిగా రిటైరైన తర్వాత కోచింగ్ స్టాఫ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. గత సీజన్ వరకూ హెచ్ కోచ్ గా ఉన్న ప్లెమింగ్‌తోనూ, మాజీ కెప్టెన్ ధోనీతోనూ హస్సీకి మంచి సంబంధాలున్నాయి. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో చెన్నై బ్యాటింగ్‌కు హస్సీ కీలకంగా ఉన్నాడు. ఆటగాడిగా రెండుసార్లు టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషిం చిన ఈ ఆసీస్ దిగ్గజం, బ్యాటింగ్ కోచ్‌గా మరో మూడు టైటిళ్ల విజయాల్లో భాగమయ్యాడు.

బ్యాటింగ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఇప్పటికే సీఎస్కే హస్సీకి సమాచారమిచ్చింది. హస్సీ స్థానంలో చెన్నై ఎవరిని బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేస్తుందో చూడాలి. కాగా వచ్చే సీజన్‌లో మరో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోచింగ్ స్టాఫ్‌లో హస్సీని చూసే అవకాశముంది.

ఇప్పటికే కొన్ని జట్లు చర్చలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమ్మన్స్‌ను కూడా సీఎస్కే తప్పించింది. అతని స్థానంలో మొహిత్ శర్మ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అటు ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్ భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం ఈ కోచింగ్ స్టాఫ్ ప్రక్షాళనలో జహీర్‌ఖాన్‌తో పాటు ధోనీ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు