అసలు నిజాన్ని దాచారా? వార్నర్ సంచలనం

14-11-2026 | 12:46pm

8 ఏళ్ల తర్వాత మళ్లీ బాల్ ట్యాంపరింగ్ ప్రకంపనలు.. వార్నర్ సంచలన ఆరోపణలు!

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిన Ball Tampering Scandal మరోసారి తెరపైకి వచ్చింది. 2018లో ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసిన Sandpapergate వివాదంపై తాజాగా కొత్త చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో ఈ వ్యవహారానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించగా.. మాజీ ఓపెనర్ David Warner సంచలన ఆరోపణలతో ముందుకొచ్చాడు. అప్పట్లో జరిగిన విచారణలో కొందరు స్టార్ బౌలర్లను ఎందుకు ప్రశ్నించలేదంటూ Cricket Australia తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

వార్నర్ తాజాగా Instagram వేదికగా చేసిన పోస్టులో 2018 Investigationపై ప్రశ్నలు లేవనెత్తాడు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం అప్పటి విచారణలో Josh Hazlewood, Mitchell Starc, Nathan Lyonలను అధికారులు ప్రశ్నించలేదని ఆరోపించాడు. వివాదానికి సంబంధించిన పూర్తి నిజాలను వెలికితీసే ప్రయత్నం జరగలేదని, ముందుగానే కొందరిని బాధ్యులుగా నిర్ణయించుకుని విచారణ సాగించినట్లుగా అనిపిస్తోందని విమర్శించాడు. అసలు విషయాలను బయటకు తీసుకురావడానికి బదులుగా కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలతో ఎనిమిదేళ్ల క్రితం నాటి వివాదం మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు శాండ్‌పేపర్ ఉపయోగించిన ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు తీసుకున్నారు. వారి కెరీర్‌పై కూడా ఈ వివాదం తీవ్ర ప్రభావం చూపింది.

మరోవైపు వార్నర్ ఆరోపణలపై Cricket Australia స్పందించింది. 2018లో నిర్వహించిన విచారణలో ఆటగాళ్లందరికీ తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించామని స్పష్టం చేసింది. గత ఎనిమిదేళ్లలో ఈ కేసుకు సంబంధించి కొత్త Evidence ఏమైనా ఉంటే వెల్లడించవచ్చని తెలిపింది. అయితే పాత విచారణను మళ్లీ ప్రారంభించే ఉద్దేశం లేదని CA Chief Executive Todd Greenberg ఇప్పటికే స్పష్టం చేశారు. ఉస్మాన్ ఖవాజా తన పుస్తకంలో వెల్లడించిన అంశాలు ఇతర ఆటగాళ్లు గతంలో చెప్పిన విషయాలకు భిన్నంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో మరో Investigation అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు