చలి చంపుతుంది

14-11-2026 | 10:40am

13 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. వణుకుతున్న జనం

బోథ్, నవంబర్ 14 (విజయక్రాంతి): రోజురోజుకు చలి(Temperatures Drop) తీవ్రత పెరిగిపోతున్నది. ఫలితంగా వివిధ పనులకు వెళ్లే జనం జంకుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి చలిగాలు వేస్తున్నాయి. తెల్లవారుజాము 7 గంటల వరకు జనం జిల్లా నుండి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. 

పాఠశాలలకు వెళ్లే పిల్లలు

వివిధ గ్రామాల నుండి పాఠశాలకు వెళ్లే పిల్లలు చలితో గజగజావనికి పోతున్నారు. వివిధ పాఠశాల ల నుండి స్కూలు పిల్లలను తీసుకువెళ్లే పాఠశాలల బస్సులు ఆటోలు ఉదయం 7:30 గంటలకు గ్రామాలకు వస్తుండడంతో పిల్లలు ఎముకలు కొరికే చలిలో సహితం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధం కావలసి వస్తున్నది. వణుకుతున్న చలిలో విద్యార్థులనుపాఠశాలకు వెళ్లేందుకు సిద్ధం చేయడం గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామానికి బస్సు వచ్చేలోపు వారిని సిద్ధం చేసి ఉంచాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సాయంత్రం పూట పిల్లలు పాఠశాల నుండి వెళ్ళకముందే చల్లని ఈదురు గాలులు వీ స్తుండడంతో విద్యార్థులు ఇతనికి వనికి పోతున్నారు. 

రాత్రి చలి పగలు ఎండ

మొన్నటి వరకు చలి తీవ్రత అంతగా లేకపోగా వారం రోజుల నుండి చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నది. పగటిపూట ఎండ తీవ్రత అధికంగా ఉంటుండగా, రాత్రిపూట చలితో సతమతమవుతున్నారు. కూలి పనులకు వెళ్లేవారు పొట్ట చేత పట్టుకొని బ్రతుకు బండి సాగించేవారు చలి తీవ్రతను తట్టుకునేందుకు సతమతమగుతున్నారు. మహారాష్ట్ర నుండి కూలి పని కోసం వచ్చిన వారు చలి నుండి కాపాడుకునేందుకు చలి మంటలను రాజేష్కుని నిద్రపోవాల్సి వస్తున్నది. అసౌకర్యాల గుడిసెల్లో జీవించే వీరు తోపాటు చిన్న పిల్లలు చాలీచాలని నిద్ర తోకాలం వెళ్లదీయాల్సివస్తున్నది.

మరిన్ని వార్తలు