భక్తుడి కళ్లజోడులో రహస్యం

14-11-2026 | 12:05pm

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కలకలం

భద్రతా వైఫల్యమా? పూజారుల అప్రమత్తతతో వెలుగులోకి!

తిరుపతి, నవంబర్ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భక్తుడి కళ్లజోడులో రహస్యంగా అమర్చిన Spy Camera బయటపడటంతో ఆలయ వర్గాల్లో కలకలం రేగింది. సాధారణ కళ్లజోడులా కనిపిస్తున్న దానిలో కెమెరా ఉండటాన్ని గుర్తించిన పూజారులు వెంటనే Security Staffను అప్రమత్తం చేశారు. దీంతో ఆలయ భద్రతా వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన అంకేష్ అగర్వాల్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చాడు. ఈ సందర్భంగా అతడి కళ్లకు ఉన్న Smart Glassesను అమ్మవారి ఆలయంలోని పూజారులు గమనించారు. వాటిలో రహస్య కెమెరా ఉన్నట్లు గుర్తించి వెంటనే Special Protection Force (SPF) సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అంకేష్ అగర్వాల్ రూ.5 వేలు చెల్లించి రాహుకేతు పూజ నిర్వహించుకున్నట్లు తెలిసింది. అనంతరం స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా వీడియో Recording చేశాడా? స్వామివారి ఆలయంలోనూ చిత్రీకరణకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. అతడి వద్ద ఉన్న Camera Glassesను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. శ్రీకాళహస్తి ఆలయంలోని అన్నప్రసాద పోటులో ఇటీవలే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటన జరిగిన 24 గంటలు గడవకముందే Spy Camera ఘటన వెలుగులోకి రావడంతో భక్తుల్లో ఆందోళన పెరిగింది. ఆలయ గర్భగుడి, ప్రాంగణాల్లో ఫొటోలు, వీడియోలు తీయడంపై పూర్తిస్థాయి నిషేధం అమల్లో ఉంది. భద్రతా కారణాలతో Smart Devices, Electronic Gadgetsను కూడా అనుమతించరు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.



మరిన్ని వార్తలు