బాలల పండుగ
చిన్నారుల నవ్వుల్లోనే దేశ భవిష్యత్తు.. Children's Day సందేశం
చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే సందేశంతో ప్రతి ఏడాది నవంబర్ 14న భారతదేశంలో Children's Day (బాలల దినోత్సవం) జరుపుకుంటారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. పిల్లలంటే ఎంతో ప్రేమ చూపించే నెహ్రూను చిన్నారులు ఆప్యాయంగా Chacha Nehru అని పిలిచేవారు.
1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ (ప్రస్తుత ప్రయాగ్రాజ్)లో నెహ్రూ జన్మించారు. 1947లో స్వాతంత్ర్యం అనంతరం భారత తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన, వారి విద్య, అభివృద్ధి, సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. నెహ్రూ జీవించి ఉన్న సమయంలోనే నవంబర్ 14ను Children's Dayగా గుర్తించారు. 1957లో ఆయన చేసిన ప్రసంగంలోనూ ఈ సందర్భాన్ని బాలల దినోత్సవంగా ప్రస్తావించారు. 1964 మే 27న ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకార్థం నవంబర్ 14న ఈ వేడుకను కొనసాగిస్తున్నారు.
బాలల దినోత్సవం జరుపుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడం, వారి హక్కులను కాపాడటం, బాల కార్మికత్వం, Child Trafficking, వేధింపులు, దోపిడీ వంటి సమస్యలను అరికట్టడం. పిల్లలకు మెరుగైన Healthcare, Nutrition అందించడంతో పాటు వారి శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడం కూడా ఈ రోజు ముఖ్య సందేశం. కులం, మతం, లింగం, ఆర్థిక పరిస్థితి, వైకల్యం వంటి భేదాలు లేకుండా ప్రతి చిన్నారికి Equal Opportunities కల్పించాల్సిన అవసరాన్ని ఈ వేడుక గుర్తుచేస్తుంది.
పిల్లలకు చదువుతో పాటు భద్రత, ఆరోగ్యం, స్వేచ్ఛ, గౌరవం అందినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. బాలల హక్కులపై Awareness పెంచడం, వారి ప్రతిభను ప్రోత్సహించడం, కలలను సాకారం చేసుకునే అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నారుల చిరునవ్వులు కేవలం కుటుంబానికే కాదు.. దేశ భవిష్యత్తుకు కూడా ఆశాకిరణాలు. అదే బాలల దినోత్సవం అందించే అసలైన సందేశం.