420 హామీలు.. 6 గ్యారంటీలు.. కాంగ్రెస్ చేసిందేమిటి?

14-11-2026 | 10:44am

కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక (Election Manifesto) అభయ హస్తంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 420 హామీలు, ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి, కనీసం రూ.5 వేల కోట్లు కూడా కేటాయించలేదని ఆరోపించారు. అభయ హస్తం (Abhaya Hastham) కింద రూ.12 లక్షలు ఇస్తామని వాగ్దానం చేసి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందించలేదని విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి సంబంధించిన అంశాలతో పాటు, నెరవేర్చని హామీల జాబితా అంతులేకుండా ఉందని కేటీఆర్ ఆరోపించారు.

మరిన్ని వార్తలు