అయ్యప్ప దీక్షలో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
మునుగోడు,నవంబర్ 14 (విజయక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(Munugode MLA Komatireddy Rajagopal Reddy) శనివారం చండూరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాలధారణ చేసి దీక్ష(Ayyappa Deeksha) స్వీకరించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుచరులు కలిపి 100 మందికి పైగా అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో నూతనంగా నిర్మించిన ఆలయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విగ్రహాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.