తక్షణమే హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించాలి

25-11-2026 | 05:05am

మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ డిమాండ్

పంజాగుట్ట, నవంబర్ 24(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) (హెచ్‌సీఏ)లో నెలకొన్న పాలనాపరమైన సమస్యలను పరిష్కరించి, పారదర్శకతతో కూడిన ప్రజాస్వామ్య పాలనను(Democratic Governance) పునరుద్ధరించాలని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్(Former HCA President Arshad Ayub), మాజీ సెక్రటరీ జాన్ మనోహర్‌లు(ex-Secretary John Manohar) డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అపెక్స్ కౌన్సిల్ పదవీకాలం ముగిసినందున దానిని పొడిగించకూడదన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను నియమించి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.రిటైర్డ్ జస్టిస్ నవీన్‌రావు నేతృత్వంలోని ఎస్‌ఎంసీ (సూపర్‌వైజరీ కమిటీ) వెంటనే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కౌన్సిలర్ల సంఖ్య పెంపు, సెలెక్టర్ల అర్హతల సవరణ విషయంలో తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్ సింగ్, అపెక్స్ కౌన్సిల్‌కు పంపిన ఈ -మెయిల్స్‌కు ఎస్‌ఎంసీ నుంచి స్పందన లేదని వారు ఆరోపించారు.

ఎన్నికల్లో పోటీ చేసే వారికి స్పష్టమైన అర్హత ప్రమాణాలు ఉండాలన్నారు. ముందుగా కౌన్సిలర్‌గా ఎన్నికైన వారే ఆఫీస్ బేరర్ పదవులకు పోటీ చేసేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆమోదించిన రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏజీఎం నిర్వహించి అంబుడ్స్‌మన్,  ఎథిక్స్ ఆఫీసర్లను నియమించాలని అయూబ్, జాన్‌లు డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు