దేవాలయాల్లో కార్తీక శోభ!

25-11-2026 | 05:15am
  1. మార్మోగిన శివనామస్మరణ
  2. దీపకాంతులతో దేదీప్యమానంగా పుణ్యక్షేత్రాలు

మేడ్చల్/మహబూబాబాద్/ధర్మపురి/మల్యాల, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక  పౌర్ణమి(Karthika Purnima) సందర్భంగా శివనామస్మరణలతో రాష్ట్రంలోని పలు ఆలయాలు మంగళవారం ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. జగిత్యాల జిల్లా(Jagtial District) ధర్మపురి పుణ్యక్షేత్రం గోదావరి తీరంలో భక్తులు(devotees) కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. బ్రహ్మపుష్కరిణి కోనేరులో పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Devasthanam) నుంచి శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం, శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం, వరంగల్‌లోని స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయం, ఘనపురం కోటగుళ్లు, భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రాలు కార్తీక మాస ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకలుగా నిలిచాయి. మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్ట భవాని రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు(devotees) పోటెత్తారు. 

మరిన్ని వార్తలు