మూడోది మనదే

12-10-2026 | 05:20am
  1. అభిషేక్ శర్మ విధ్వంసం
  2. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
  3. మూడో టీ20లో భారత్ విజయం
  4. సిరీస్‌లో భారత్‌కు 2 ఆధిక్యం

రెండో టీ20లో భారీస్కోరు చేసినా ఓటమిపాలైన టీమిండియా ఇండోర్‌లో(Team India in Indore) దెబ్బకు దెబ్బ కొట్టింది. అభిషేషక్ శర్మ విధ్వంసంతో మరోసారి 200 ప్లస్ స్కోరు చేసిన భారత్ ఈ సారి విండీస్‌కు అవకాశమివ్వలేదు. బ్యాటింగ్ పిచ్‌పై బౌలర్లు సమిష్టిగా రాణించి కరేబియన్ టీంను కట్టడి చేశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రేయాస్ సేన 2 ఆధిక్యంలో నిలిచింది.. తర్వాతి మ్యాచ్ బుధవారం హైదరాబాద్‌లో జరుగుతుంది.

ఇండోర్. అక్టోబర్ 11 : మరోసారి టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్(West Indies fielding) ఎంచుకుంది. ఊహించినట్టుగానే ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగాయి. శివమ్ దూబే స్థానంలో నితీష్ రెడ్డి, కుల్దీప్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ జట్టులోకి వచ్చారు. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆరంభంలో భారీ హిట్టింగ్‌తో అత్యంత వేగంగా సాగినప్పటికీ,

ఆ తర్వాత మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ వరుస వికెట్లు కోల్పోవడంతో తడబడింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన సంజూ శాంసన్ ఇండోర్‌లో నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం విధ్వంసం సృష్టించాడు. విండీస్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మొత్తంగా 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి జట్టుకు అద్భుత మైన ఆరంభాన్ని ఇచ్చాడు. అభిషేక్ శర్మకు తోడుగా ఇషాన్ కిషన్ కూడా ధాటి గా ఆడుతూ 18 బంతు ల్లో 6 ఫోర్లు, ఒక సిక్స ర్‌తో 37 పరుగులు చేశాడు. వీరిద్దరి దూ కుడుతో భారత స్కోరు ఒక దశలో 250 పరుగులు దాటేలా కనిపించింది. కానీ పవర్ ప్ల్లే తర్వాత విండీస్ బౌలర్లు పుంజుకున్నారు.

కెప్టెన్ శ్రేయ స్ అయ్యర్ (1), విఫలమయ్యాడు. తిలక్ వర్మ (28), నితీశ్ కుమార్ రెడ్డి (21), అక్షర్ పటేల్ (20) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించినా క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కు కోలేకపోయారు. దీంతో భారత్ 99 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 7 వికెట్లను కోల్పో యింది.  వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్, షమర్ జోసెఫ్, షమర్ స్ప్రింగర్ రెండేసి వికె ట్లు పడగొట్టి భారత ఇన్నింగ్స్ కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.

రెండో టీ20లో 250 టార్గెట్‌ను అలవోకగా ఛేదించిన విండీస్ మంచి జోష్ మీదే బరిలోకి దిగింది. హోప్, రూథర్‌ఫర్డ్, పూరన్ లాం టి బ్యాటర్లు ఉండడంతో మరోసారి ఛేదిస్తుందేమో అనుకున్నారు. అ యితే హోప్‌ను అర్షదీప్‌సింగ్ ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపాడు. అ యితే ఓపెనర్ కామిల్ పూరన్ 42 పరుగులు (27 బంతులు, 3 ఫో ర్లు, 3 సిక్సర్లు) చేసి రాణించగా, వన్‌డౌన్‌లో వచ్చిన షిమ్రాన్ హ్టుమైర్ వేగంగా 43 పరుగులు (26 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు.

లోయర్ ఆర్డర్లో షెర్ఫేన్ రూథర్ఫర్డ్ 31 పరుగులు (18 బంతులు), క్వెంటిన్ సాంప్సన్ 20 పరుగులు (13 బంతులు) చేసి భారీ షాట్లతో లక్ష్యానికి చేరువగా తీసుకెళ్లే ప్రయ త్నం చేశారు. విండీస్ 209 పరుగులే చేయగలిగింది. అర్ష్దీప్ సింగ్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 223 (అభిషేక్ శర్మ 69, ఇషాన్ కిషన్ 37, తిలక్ వర్మ 28, నితీశ్ రెడ్డి 21; ఛేజ్ 2/38, జోసెఫ్ 2/54, స్ప్రింగర్ 2/50)

వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 209/7 (పూరన్ 42, హెట్‌మెయిర్ 43, రూథర్‌ఫర్డ్ 32, స్ప్రింగర్ 35; అర్షదీప్ సింగ్ 3/44, నమన్ ధీర్ 2/39 )

మరిన్ని వార్తలు