భారత్‌కు ఎదురుందా?

10-09-2026 | 05:05am

నేడు బంగ్లాతో సెమీ ఫైనల్ 

మహిళల ఆసియా కప్ 

దుబాయి, సెప్టెంబర్ 9: మహిళల ఆసియా కప్‌(Asiacup)లో భారత్(India) జట్టు సెమీఫైనల్‌కు సిద్ధమయింది. గురువారం దుబాయ్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ మహిళల జట్టుతో తలపడబోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వం లోని భారతజట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లోనూ అజేయంగా నిలిచింది. షెఫాలీ, స్మృతి మందాన సూపర్ ఫామ్‌లో ఉండగా బౌలింగ్‌లో దీప్తి శర్మ, తెలుగమ్మా యి శ్రీ చరణి, ప్రతీకా రావల్ అదరగొడుతున్నారు. గ్రూప్-బిలో జరిగిన చివరి లీగ్ మ్యా చ్‌లో యూఏఈపై బంగ్లాదేశ్ విజయం సాధి ంచడంతో, గ్రూప్- బి నుంచి రెండో స్థానం లో నిలిచి భారత్‌తో సెమీస్ పోరుకు సిద్ధమైంది. నిగర్ సుల్తానా కెప్టెన్సీలోని బంగ్లా దేశ్ గ్రూప్-బిలో రెండు విజయాలు సాధిం చి, శ్రీలంక చేతిలో ఓడి సెమీస్‌కు చేరింది.

మరిన్ని వార్తలు