ఆధిక్యం ఎవరిదో ?
భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్(T20 Series) రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే, రెండో టీ20లో విండీస్ బదులు తీర్చుకుంది. అది కూడా 250 టార్గెట్‌ను అలవోకగా ఛేదించేసింది. ఇప్పుడు మూడో టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం పెంచుకునేందుకు రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇండోర్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద ఖాయమని అంచనా.
- 1 సమంగా ఉన్న ఇరు జట్లు
- నేడు భారత్, విండీస్ మూడో టీ20
- ఇండోర్‌లోనూ పరుగుల వరదే
- భారత బౌలింగ్‌పై ఆందోళన
ఇండోర్, అక్టోబర్ 10 : పొట్టి ఫార్మాట్ లో(Short format) ఎవ్వరినీ ఫేవరెట్‌గా చెప్పలేం. అందులోనూ టీ20ల్లో స్పెషలిస్ట్ టీంగా పేరున్న వెస్టిండీస్‌ను తేలిగ్గా తీసుకోలేమని మరోసారి రుజువైంది. రెండో టీ20లో వారి విధ్వంసమే దీనికి ఉదాహరణ. కరేబియన్ల జోరుతో ఇప్పుడు భారత్,విండీస్ టీ20 సిరీస్ ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఇరు జట్లు 1 సమంగా ఉన్నాయి. ఆదివారం ఇండోర్ వేదికగా రెండు జట్ల మధ్య మూడో మ్యాచ్ జరగబోతోంది.
దీనిలో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భారత్, విండీస్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. రాంఛీలో విండీస్ 250 టార్గెట్‌ను ఛేజ్ చేయడం ఇప్పుడు భారత బౌలిం గ్‌ను ఒత్తిడిలో పడేసింది. కోచ్ గంభీర్ సైతం పిచ్‌లపైనా, బౌలింగ్,ఫీల్డింగ్‌పైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్‌కు భారత జట్టుపైనే ఒత్తిడి కనిపిస్తోం ది. తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
తొలి రెండు మ్యా చ్‌లలో నిరాశపరిచిన సంజూ శాంసన్ రాం ఛీలో అదరగొట్టాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో సంజూ ఫామ్‌లోకి రావడంతో వైభవ్ సూర్యవంశీ మరోసారి బెంచ్‌కే పరిమితం కాను న్నాడు. అలాగే మిగిలిన కాంబినేషన్‌లో మార్పులు చేస్తారా అనేది ఆసక్తికరంగా మా రింది. రెండో మ్యాచ్‌లో భారత బౌలింగ్ నిరాశపరిచింది. ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దూబే ప్రభావం చూపలేకపోయాడు.
దీంతో నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు పేస్ ఎటాక్ లో అర్షదీప్ సింగ్‌కు తోడు మయాంక్ యా దవ్ రాణిస్తున్నాడు. రాంఛీలో తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీసి మంచి ఆరంభాన్నిచ్చాడు. ఇండోర్‌లో స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ కూడా రాణిస్తే భారత్ గెలిచే అవకాశముంటుంది. మరోవైపు చివరి వన్డే విజయంతో విండీస్‌లో జోష్ పెరిగిందనేది వాస్త వం. ఆ తర్వాత తొలి టీ20లో ఓడినా వెంటనే పుంజుకుని దెబ్బకు దెబ్బ కొట్టింది.
ఆ జట్టు కెప్టెన్ షై హోప్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మి గిలిన కీలక బ్యాటర్లను ఔట్ చేస్తున్న భారత బౌలర్లు హోప్‌ను మాత్రం ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. అతన్ని త్వర గా ఔట్ చేయడంపైనే మన విజయావకాశాలు ఆధారపడి ఉన్నా యి. అలాగే రూథర్ ఫర్డ్ సైతం మిడిలార్డర్‌లో విధ్వంసకర బ్యా టింగ్‌తో చెలరేగిపోతున్నాడు. అతన్ని కూడా కట్టడి చేయకుంటే ఇబ్బందులు తప్పవు. ఇదిలా ఉంటే ఇండోర్ పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
బౌం డరీలు చిన్నవిగా ఉండడంతో బ్యాటర్లకు పండగే. దీంతో అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం. రాంఛీ పిచ్‌పై గంభీర్ అ సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇండోర్‌లో బౌలింగ్ వ్యూహాలు ఎలా ఉండబోతు న్నాయనేది చూడాలి. ఈ పిచ్‌పైనా ఛేజింగ్ జట్లకే అడ్వాంటేజ్. మంచు ప్ర భావం ఉండనుండడంతో టాస్ కీలకం కానుంది.
తుది జట్ల అంచనా
వెస్టిండీస్ : కామిల్ పూరన్, షై హోప్, హెట్‌మెయిర్, రోస్టన్ ఛేజ్, రోవ్‌మన్ పావెల్, షెర్పాన్ రూథర్‌ఫర్డ్, కీమో పాల్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డ్, అకిల్ హోస్నేన్, సమర్ జోసెఫ్
భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నమన్ ధీర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్