గ్రామీణ క్రికెటర్ల కోసం కిసాన్ క్రికెట్ లీగ్
ముంబై, అక్టోబర్ 10 : దేశంలోని గ్రామీ ణ ప్రాంతాలకు చెందిన క్రికెట్ నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా కిసాన్ క్రికెట్ లీగ్(Kisan Cricket League) ప్రారంభం కానుంది. ఇన్‌డాట్ స్పోర్ట్స్‌స ప్రసార భారతి సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. ఖేలేగా భారత్,దేఖేగా ఇండియా అనే నినాదంతో ఈ టోర్నీకి రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ ద్వారా 140 మంది క్రికెటర్లను, 30 మంది గాయలను ఎంపిక చేసి కిసాన్ క్రికెట్ లీగ్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
తొలి సీజన్ 15 ఓవర్ల వైట్ బాల్ ప్రొఫెషనల్ క్రికెట్ ఫార్మాట్‌లో జరుగుతుంది. దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లను ఎంపిక చేసి 7 జట్లుగా విభజించనున్నారు. ఎంపికైన గాయకులు ప్రాంతీయ జట్ల థీమ్‌సాంగ్స్‌ను ఆలపించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రికెటర్లకు ఇదొక గొప్ప వేదిక కానుందని కిసాన్ క్రికెట్ లీగ్ ఫౌండర్, దర్శకుడు అతుల్ పాండే చెప్పారు. గ్రామా ల్లో ఎంతో క్రీడా నైపుణ్యం ఉందని, వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు.