ఘనంగా క్రీడాపురస్కారాల ప్రదానం

14-11-2026 | 05:05am

అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, నవంబర్ 13: క్రీడల్లో విశేష ప్రతిభను కనబరిచేవారికి అందించే జాతీయ క్రీడాపురస్కారాల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. 2025 సంవత్సరానికి గానూ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) అవార్డులను అందజేశారు. అయితే దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డుకు ఈసారి ఎవరూ ఎంపిక కాలేదు. అర్జున అవార్డు గ్రహీతలలో చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్, విదిత్ గుజరాతి, అథ్లెట్ తేజస్విన్ శంకర్, బ్యాడ్మింటన్ మహిళా డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్, - ట్రీసా జాలీ , బాక్సర్ నరేంద్ర బెర్వాల్, యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ఉన్నారు. 

మరిన్ని వార్తలు