హెచ్‌సీఎలో జెర్సీ, కిట్ కాంట్రాక్టుల దందా

11-10-2026 | 05:20am
  1. రంజీ ప్లేయర్‌కు చెందిన సంస్థకు జెర్సీ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు ?
  2. టీసీఏ తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్, అక్టోబర్ 10 : హైదరాబా ద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)(Hyderabad Cricket Association)పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) తీవ్ర ఆరోపణలు చేసింది. కిట్,జెర్సీ కాంట్రాక్టుల దందాకు హెచ్‌సీఏ తెరతీసిందని ఆరోపించింది. పనితీరులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయంటూ తీ వ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

టీమ్ జెర్సీ కాంట్రాక్టుల పారదర్శకత, ఎంపిక మరి యు కోచింగ్ ప్రక్రియలో ఒక ప్రైవేట్ క్రికెట్ అకాడమీ ఆధిపత్యం, ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై టీసీఏ ప్ర శ్నలు గుప్పించింది. హైకోర్టు నియమించిన జస్టిస్ (రిటైర్డ్) పి. నవీన్ రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ  పర్యవేక్షణ ఉన్నప్ప టికీ ఈ సమస్యలు బయటపడ్డాయని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురు వా రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ క్రికెట్‌కు పారదర్శ కత, విశ్వసనీయతను తిరిగి తెచ్చేందుకు ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపించి, తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఒకప్పుడు డ బ్బులు ఇస్తేనే ఎంపికనే ఆరోపణలు ఉండేవనీ, ఇప్పుడు అది ‘కిట్ ఇస్తేనే ఎంపిక’ అనే స్థాయికి చేరిం దా అనే అనుమానం క లుగుతోందన్నారు.

జెర్సీ కాంట్రాక్టులు, ఆటగాళ్ల ఎంపిక పారదర్శకమైన నిబంధనల ప్రకారం జరుగుతున్నా యా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వా ర్థపూరితంగా వ్యవహరిస్తున్నారా అనేది ప్రజలకు తెలియాల న్నారు. మూడు వేర్వేరు వ యస్సు విభాగాలకు ముగ్గురు వేర్వేరు వెండర్లను ఎందుకు ఎంపిక చేశారనీ ప్రశ్నించారు. రంజీ జట్టులో ఉన్న ఒక ఆటగాడి కుటుంబానికి చెందిన సంస్థకు జెర్సీ కాంట్రాక్ట్ ఇవ్వ డంపై హెచ్‌సీఏ సమాధానం చెప్పాలన్నారు.

మరిన్ని వార్తలు