జసికేత్, శివశంకర్ సెంచరీలు

16-10-2026 | 05:10am

టీసీఏ అండర్- స్టేట్ లీగ్

వరంగల్, అక్టోబర్ 15 : తెలంగాణ వ్యాప్తంగా యువక్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) నిర్వహిస్తున్న అండర్ స్టేట్ లీగ్ హోరాహోరీగా సాగుతోంది. పలువురు యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శ నతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా వికారాబాద్ జట్టులో జసికేత్(119), శివశంకర్ (102) సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరి విధ్వంసంతో వికారాబాద్ 25 ఓవర్లలో 280 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో అచ్చంపేట్ 244 పరుగులే చేయ గలిగింది. జసికేత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మిగిలిన మ్యాచ్‌లలో  జనగాం జట్టుపై కరీంనగర్ 95 పరుగుల తేడాతోనూ, ఖమ్మం జట్టుపై రంగారెడ్డి 121 పరుగుల తేడాతోనూ, నారాయణ్‌పేట జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 175 పరుగుల చేడాతో విజయం సాధించాయి. రాష్ట్ర వ్యాప్తంగా యువక్రికెటర్లు తమ ప్రతిభను చాటుకోవడానికి చక్కని వేదికగా టీసీఏ టోర్నీలు ఏర్పాటు చేస్తోందని సెక్రటరీ ధరం గురువారెడ్డి చెప్పారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను గుర్తించడమే లక్ష్యంగా టీసీఏ ముందుకెళుతోందన్నారు.    

మరిన్ని వార్తలు