టీసీపీఎల్ లోగో ఆవిష్కరించిన కేటీఆర్
కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ’తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్’ (టీసీపీఎల్)(Telangana Corporate Premier League Logo) నాలుగో సీజన్ లోగో , అధికారిక వెబ్‌సైట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసి ల్ల ఎమ్మెల్యే, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Former IT Minister KTR) ఆవిష్కరించారు.
కార్పొరేట్ రంగానికి చెందిన ఉద్యోగులలో ఉన్న క్రీడా నైపుణ్యా న్ని వెలికితీసేందుకు, వారికి ఒత్తిడి లేని వా తావరణాన్ని అందించేందుకు ఈ టీ20 క్రికె ట్ టోర్నమెంట్‌ను 7హెచ్ స్పోరట్స్ ఫౌండర్ వెంకటేశ్ రూపొందించారు. గత మూడు సీజన్లను అత్యంత విజయవంతంగా పూర్తి చేసుకున్నటీసీపీఎల్ అదే ఉత్సాహంతో నా లుగో సీజన్‌ను 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.
కార్పొరేట్ ఉద్యోగుల క్రీడా వికా సానికి ఇలాంటి టోర్నీమెంట్ నిర్వహించిస్తున్న 7హెచ్ స్పోరట్స్ డైరెక్టర్ ,వ్యవస్థాపకు డు వెంకటేష్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. గత మూడు సీజన్లలో దాదాపు 130కి పైగా కార్పొరేట్ కంపెనీల నుండి 500 మందికి పైగా ఉద్యోగులు ఈ లీగ్‌లో ఉ త్సాహంగా పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ లోగో, వెబ్సైట్ లాంచ్ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకులు రాఘవేంద్ర యాదవ్ పాల్గొన్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే కార్పొరే ట్ ఉద్యోగులకు వారాంతంలో ఇది ఒక చక్క ని రిక్రియేషన్ లాగా రిఫ్రెష్మెంట్ లా గా ఈ లీగ్ సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా లీగ్ వ్యవస్థాపకమైన వెంకటేష్‌కి ఆయన ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.