పరుగుల రారాజుకు పుట్టినరోజు!
బ్యాట్ పట్టి బరిలోకి దిగితే పరుగుల వరద.. మైదానంలో అడుగుపెడితే రికార్డుల వేట.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు!
నవంబర్ 5, 1988న ఢిల్లీలో జన్మించిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) నేడు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బ్యాట్ పట్టి బరిలోకి దిగితే పరుగుల వరద పారించే కోహ్లీ.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
చిన్న వయసులోనే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న కోహ్లీ(Virat Kohli) అంచెలంచెలుగా ఎదిగారు. 2008లో అండర్-19 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు.అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. వన్డేల్లో సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ, ఛేజింగ్‌లో అసాధ్యమనుకున్న లక్ష్యాలను సుసాధ్యం చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిట్‌నెస్, క్రమశిక్షణ, దూకుడు, గెలవాలనే పట్టుదలతో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
పుట్టినరోజుకు ముందే తన బ్యాట్‌తో అభిమానులకు అదిరిపోయే కానుక అందించారు కోహ్లీ(Virat Kohli). నవంబర్ 4న న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కేవలం 51 బంతుల్లో 74 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో వన్డే కెరీర్‌లో 80వ అర్ధశతకాన్ని నమోదు చేశారు.38వ ఏట అడుగుపెడుతున్నా పరుగుల దాహం మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిస్తున్నారు కింగ్ కోహ్లీ. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా, కోట్లాది అభిమానులకు ఆరాధ్య క్రికెటర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రికార్డులు ఎన్నో.. విజయాలు మరెన్నో.. కానీ అభిమానుల గుండెల్లో విరాట్ కోహ్లీ స్థానం మాత్రం ప్రత్యేకం. హ్యాపీ బర్త్‌డే కింగ్ కోహ్లీ!