వాషింగ్టన్ సుందర్ ఫిట్

09-09-2026 | 05:00am

ఆఫ్ఘన్‌తో సిరీస్‌కు సిద్ధం

బుమ్రాపై కొనసాగుతున్న సస్పెన్స్

బెంగళూరు, సెప్టెంబర్ 8: భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) పూర్తి ఫిట్నెస్ సాధించాడు. గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరమైన సుందర్, బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

దీంతో సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ- సిరీస్‌కు సుందర్ అందుబాటులో ఉండనున్నాడు. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లో ఓడిపోయిన భారత జట్టుకు సుందర్ రాక పెద్ద ఊరటనిచ్చే అంశం. బుమ్రా ఇంకా మ్యాచ్ సిమ్యులేషన్ పూర్తి చేయలేదు. బుధవారం జరిగే ఫిట్నెస్ టెస్టు తర్వాతే అతడు ఈ సిరీస్ ఆడాలా వద్దా అనేదానిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డిల ఫిట్‌నెస్ పైనా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇద్దరూ ఇప్పటికే ఫిట్నెస్ టెస్టులు, మ్యాచ్ సిమ్యులేషన్ పూర్తి చేశారు. అయినప్పటికీ వారిని ఇంకా పూర్తిగా ఫిట్‌గా ప్రకటించలేదు. 

మరిన్ని వార్తలు