నన్నెవడ్రా ఆపేది
- కింగ్ కోహ్లీ @ 15000 రన్స్
- వన్డేల్లో విరాట్ ప్రపంచ రికార్డు
- సచిన్ రికార్డు గల్లంతు
వరల్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డుల ఊచకోత కొనసాగుతోంది. ఇంకేముంది రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్నాడు, వన్డే వరల్ కప్(ODI World Cup) ఆడడం కష్టమే అంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ మరోసారి రెచ్చిపోయా డు. విండీస్‌తో తొలి వన్డేలో తవ విశ్వరూ పం చూపించాడు. కోహ్లీ అంటే క్లాస్ మాత్ర మే కాదు ఊర మాస్ కూడా అని చాటి చెబుతూ కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూ పించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు.
ఇవి కూడా చదవండి: గిల్, కోహ్లీ ధనాదన్
తన ఇన్నింగ్స్లో 59 పరుగు వద్ద కోహ్లవీ వన్డే క్రికెట్లో 15,000 పరుగుల మార్క్ను అధిగమించాడు. టెండూల్కర్ తర్వాత వన్డేల్లో 15 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. వన్డేల్లో 15 వేల పరుగులు అందుకోవడానికి విరాట్ కోహ్లీకి 303 ఇన్నింగ్స్‌ల్లో అవసరం కాగా సచిన్ టెం డూల్కర్ 377 ఇన్నింగ్స్‌లో తీసుకున్నాడు.
వన్డేల్లో 15 వేల పరుగులు సచిన్ టెండూల్కర్ కంటే 74 ఇన్నింగ్స్లు తక్కువ తీసుకున్న విరాట్ కోహ్లీ, చరిత్ర పుస్తకాల్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 8 వేల నుంచి 15 వేల వరకూ అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా నిలిచాడు
కోహ్లీకి రికార్డులు బద్దలు కొట్టడం కొత్తే మీ కాదు. వన్డేల్లో అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000, 14,000 పరుగులు పూర్తి చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. ముఖ్యం గా 9,000 నుంచి 10,000 పరుగులకు చేరడానికి కేవలం 11 ఇన్నింగ్స్లు మాత్రమే తీసుకొన్నాడు.ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న కోహ్లీ, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వ నున్న వచ్చే ఏడాది ప్రపంచకప్ను తన చివరి మెగా టోర్నమెంట్గా ఆడనున్నాడు.