ఆరంభం అదిరేనా ?

13-09-2026 | 05:35am

ఆసియా క్రీడలకు ముందు సన్నాహక సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. ఆఫ్గనిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సిరీస్‌లో అదరగొట్టి ఇటీవల టీ ట్వంటీ పరాభవాలకు బ్రేక్ వేయాలని భావిస్తోంది. దీని కోసమే పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. మరోవైపు పొట్టి క్రికెట్‌లో పెద్ద జట్లకు షాకిస్తున్న అఫ్గాన్ భారత్ పైనా సంచలనం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

  1. ఆరంభం అదిరేనా ?
  2. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20
  3. భారత్ సత్తాకు పరీక్ష
  4. తుది జట్టు కూర్పే తలనొప్పి
  5. శుభారంభం కోసం ఇరు జట్ల ఆరాటం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : శ్రీలంక టూర్ తర్వాత విరామం తీసుకున్న భారత్ క్రికెట్ జట్టు(Indian Cricket Team) ఇప్పుడు టీ ట్వంటీ ఫార్మాట్‌తో అలరించబోతోంది. అఫ్ఘనిస్తాన్ జట్టు భారత్ వేదికగా నిర్వహిస్తున్న టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారమే జరగబోతోంది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium, New Delhi) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో వైట్ వాష్ పరాభవాలతో విమర్శలు ఎదుర్కొన్న భారత్ సత్తాకు ఈ సిరీస్ పరీక్షగానే చెప్పాలి.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీకి కూడా ఈ సిరీస్ సవాల్‌గా భావిస్తున్నారు. ఈ సిరీస్ కో సం బలమైన జట్టును ఎంపిక చేశారు. అందుకే ఇప్పుడు తుది జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. ఓపెనింగ్ జోడీపై తర్జన భర్జన కొనసాగుతుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ నెట్ ప్రాక్టీస్ సమయంలో చాలా సమయం కలిసి గడిపారు. దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆడి నేరుగా వచ్చి న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీ త్ బుమ్రా వేసిన బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు.

అలసట, ఫాంను దృష్టి లో ఉంచుకుని, యాజమాన్యం మొదటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి విశ్రాంతినిచ్చి టీ20 ప్రపంచ కప్‌లో తమను తాము నిరూపించుకున్న అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లతో కూడిన టాప్ మూడు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడమే మొదటి ఎంపికగా ఉండవచ్చు. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబేలు ఆడడం దాదాపు ఖాయమైపోయింది.

అయితే ఈ మిడిలార్డర్ ఇటీవలి ఫామ్ అంతగొప్పగా లేకపోవడం ఆందోళనను కలిగిస్తోంది. ఆసియా క్రీడలనే పెద్ద ఛా లెంజ్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్ బలమైన స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొని తమ జోరును తిరిగి పుంజుకోవడానికి ఈ బ్యాటింగ్ లైనప్ మొత్తానికి సవాల్‌గా చెప్పొచ్చు. బుమ్రా తిరిగి రావడం భారత ఫాస్ట్ బౌలింగ్ దళానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అతనికి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఉంటాడు.

ప్రధాన స్పిన్నర్ రేసులోరవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి పోటీ పడుతున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో పొట్టి ఫార్మాట్లో అఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా ఎదిగింది. భా రత్‌తో తలపడిన ప్రతిసారీ గట్టి పోటీని ఇస్తూ వస్తోంది. రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ నబీ, ఫజల్హక్ ఫారూఖీ వంటి ప్రపంచ స్థాయి టీ20 స్టార్లతో అఫ్ఘానిస్తాన్ జట్టు చాలా బలంగా ఉంది.

పిచ్ రిపోర్ట్  

ఈ సిరీస్ మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. ఇది చిన్న మైదానం కావడంతో బ్యాటర్లకు బాగా అనుకూలిస్తుంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉన్నందున సిక్సర్ల వర్షం కురవడం ఖాయం

తుది జట్ల అంచనా

భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్/వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

అఫ్ఘనిస్తాన్ : ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రెహమాన్ (వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, నవీన్-ఉల్-హక్.

మరిన్ని వార్తలు