పోలీసులు అంటే భయం కాదు.. భరోసా!

24-10-2026 | 05:44pm

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్ఐ మధు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్ 24: పోలీసులు(Police) అంటే భయం కాదు..ప్రజలకు భరోసా.. అని అర్వపల్లి ఎస్ఐ మధు(Arvapalli SI Madhu) అన్నారు.పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శనివారం అర్వపల్లి పోలీస్ స్టేషన్(Arvapalli Police Station) ను స్థానిక జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు(ZPHS students) సందర్శించగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని సౌకర్యాలు, ఫిర్యాదు చేసే విధానం, నేరస్తులను విచారించే పద్ధతి,ప్రజలకు అందించే సేవలపై ఎస్ఐ మధు వివరించారు.అత్యవసర సమయంలో 100కు డయల్ చేసి సహాయం పొందవచ్చని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల రక్షణకే పని చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పీ మల్లేష్,ఉపాధ్యాయులు,పోలీస్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు