వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
ఘట్ కేసర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్(Ghatkesar Circle), ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని మర్పల్లిగూడ మస్జిద్ -ఏ- బిలాల్ ఆవరణలో ఆదివారం వర్షాలు(Rains) కురవాలని భగవంతున్ని వేడుకుంటూ ముస్లిం సోదరులు(Muslim brothers) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి నదులు చెరువులు, కుంటలు నీటితో నిండాలని, రైతులకు(Farmers) మేలు జరగాలని, పర్యావరణ భూతాపం(Global Warming) తగ్గాలని ప్రజలందరికీ మంచినీటి కొరత ఏర్పడకుండా ఉండాలని, జీవరాశులన్నిటికీ మంచి నీరు అందాలని చీమ నుంచి ఏనుగు జీవరాశులన్నిటికీ ఎటువంటి పర్యావరణ హాని కలగకుండా చూడాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
ప్రపంచవ్యాప్తంగా వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని అల్లాహ్ను వేడుకుంటూ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వర్షాల కోసం నిర్వహించిన ఘట్కేసర్ ఖాజీ, హఫీస్ అబ్దుల్ సమద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ ఖయ్యుమ్, మస్జిద్ ఇమామ్ మహమ్మద్ జునేద్, మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ షానూర్, ఉపాధ్యక్షులు మహమ్మద్ షానూర్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అన్వర్, మహమ్మద్ రఫియాద్దీన్, సలీం, ఫయాజుద్దీన్, రియాజుద్దీన్, మర్పల్లిగూడ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.