కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతవచ్చింది
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్.
తుంగతుర్తి (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వచ్చిందని, నిధుల కోసం సొంత ఎమ్మెల్యేలే ఆమరణ దీక్ష చేపడతామని చెప్పడం విడ్డూరంగా ఉందని, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్(Former MLA Dr. Gadari Kishore Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, ముఖ్య నాయకుల సమీక్ష సమావేశానికి హాజరై, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై నాయకులతో మాట్లాడారు. మూడు జిల్లాల ఎమ్మెల్సీ పరిధిలో సుమారు 34 నియోజకవర్గాలు ఉన్నాయని, దీనితో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని, నమోదు చేయించే బాధ్యత పూర్తిస్థాయిలో చేయాలని కోరారు.
రైతులకు సాగునీరు, కరెంటు, ఉద్యోగ అవకాశాలు, కాంట్రాక్టర్లకు చేసిన పనులకు నిధులు సమకూర్చరములో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం, నాయకుల దౌర్జన్యాలు జరుగుతున్నాయని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అనంతరం బిఆర్ఎస్ అధికార ప్రతినిధి తునికి సాయిల్ కుమారుడైన తునికి నాగరాజు ప్రమాదానికి గురై ఉండడంతో కిషోర్ పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులుగుజ్జ యుగంధర్ రావు గారు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, సంకేపల్లి రఘునందన్ రెడ్డి , SA.రజాక్, మున్నా మల్లయ్య యాదవ్, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలు, మండల ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.