గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

26-09-2026 | 10:33pm

సర్పంచ్ ఝాన్సీ బాలాజీ

కోదాడ సెప్టెంబర్ 26(విజయ క్రాంతి) : మండల పరిధిలోని గ్రామంలో శనీవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం(Smart Ration Card Distribution Program) ఘనంగా జరిగింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కోదాడ ఎమ్మెల్యే నలమాడ పద్మావతి రెడ్డి(Padmavati Reddy) చొరవతో గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు(Beneficiaries) కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయి. దీంతో చాలా కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పలు కుటుంబాలకు ఊరట లభించింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోతు ఝాన్సీ బాలాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటుందని, స్మార్ట్ కార్డుల ద్వారా పారదర్శకంగా రేషన్ పంపిణీ జరుగుతుందని అన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు బానోతు మోతియా, బానోతు సైదులు, రేషన్ డీలర్ గుగులోతు కైక, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు