ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎనిమిది దరఖాస్తులు
28-09-2026 | 07:25pm
నేరేడుచర్ల, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు 08 దరఖాస్తులు వచ్చాయని మండల ఎంపీఓ నాగరాజు(Mandal MPO Nagaraju) తెలిపారు. వీటిలో రెవిన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించి 05 దరఖాస్తులు, హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 02, ఇరిగేషన్ సంబంధించి 01 దరఖాస్తు ఉన్నాయని, మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.