గానుగుబండ సర్పంచ్ కృషి పట్ల హర్షం

10-11-2026 | 11:26am

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామం(Ganugabanda Village)లో వీధుల వెడల్పు కార్యక్రమంగా, బొడ్రాయి బజారులో వీధి వెడల్పు చేయడానికి భీమ్ రెడ్డి దయాకర్ రెడ్డి సొంత స్థలం గోడ తొలగించడానికి, ఒప్పుకున్నందున, సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ చొరవ తీసుకొని మంగళవారం దాన్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు గ్రామ రైతుల పొలాల వద్దకు,  మిషన్లు పెద్ద పెద్ద వాహనాలు పోవడానికి మార్గం సుగమయం అయింది. దీనితో స్థానిక సర్పంచ్ కృషి పట్ల, రైతులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు  అభినందిస్తూ, హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు