గరిడేపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక
32 గ్రామాల దైవసేవకుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నిక
గరిడేపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గరిడేపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్(Garidepally Pastor Fellowship) నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని గుండాలమ్మ మెట్టులో ఉన్న పాస్టర్ జాకబ్ చర్చిలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో మండలంలోని 32 గ్రామాలకు చెందిన దైవసేవకులు పాల్గొన్నారు. అందరి అభిప్రాయాల మేరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
నూతన కమిటీ వివరాలు: చైర్మన్గా ఎం. బెంజమిన్, గౌరవ అధ్యక్షుడిగా ఎం. జాకబ్, అధ్యక్షుడిగా ఎ. రమేష్, ఉపాధ్యక్షుడిగా ఎల్. జాన్ వెస్లీ, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్. ఐజాక్ న్యూటన్, కోశాధికారిగా ఎం. విజయ్, సహాయ కోశాధికారిగా యెహన్ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు.
గౌరవ సలహాదారులుగా ఎం. మత్తయి, కె.జె. ఉదయ్ బాబు, వి. లాజర్, ఎస్. శ్రీను ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎం. డేవిడ్ ఆనంద్, నతానియేల్, ఇమ్మానియేల్, సైదులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ క్రైస్తవుల అభివృద్ధికి, సంఘాల ఐక్యతకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో దైవసేవకులు ఎ. నరేష్, ప్రసాద్, ఇశ్రాయేల్, దేవదానం, మధు రాజు, అనంతు, సైదులు, ఎ. ప్రవీణ్, ఎ. అశోక్, యేసుపాదం తదితరులు పాల్గొన్నారు.