జాతీయస్థాయి గణిత ఒలింపియాడ్‌లో జయ విద్యార్థుల ప్రతిభ

26-09-2026 | 10:20pm

కోదాడ సెప్టెంబర్ 26(విజయ క్రాంతి) : జాతీయస్థాయిలో(National level) నిర్వహించిన ఏ.ఎం.టి.ఐ. గణిత ఒలింపియాడ్‌(Mathematics Olympiad)లో జయ పాఠశాల విద్యార్థులు(Jaya School students) ప్రతిభ కనబరిచి రెండవ లెవల్‌కు అర్హత సాధించారని పాఠశాల కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైలోని ఏఎంటిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ఒలింపియాడ్‌లో జయ పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు రెండవ లెవల్‌కు అర్హత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో(Competitive exam) రాణించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఏ.ఎం.టి.ఐ.లో ప్రైమరీ లెవల్‌ నుంచి ముగ్గురు, సబ్‌జూనియర్‌ లెవల్‌ నుంచి ఆరుగురు, జూనియర్‌ లెవల్‌ నుంచి ఏడుగురు విద్యార్థులు రెండవ లెవల్‌కు అర్హత సాధించారని తెలిపారు. జయ ఒలింపియాడ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులు ఈ స్థాయి విజయాన్ని సాధించడం సంతోషంగా ఉందన్నారు.

రెండవ లెవల్‌లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచేలా విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక శిక్షణ అందిస్తుందని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, శిక్షణ అందిస్తున్న ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు.పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌, డైరెక్టర్‌ బింగి జ్యోతి, జిల్లా విద్యా ప్రణాళికాధికారులు విద్యార్థులను అభినందించారు.

మరిన్ని వార్తలు