కోదాడ కిట్స్ కళాశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం

16-10-2026 | 08:38pm
  1. కోదాడ డిఎస్పి శ్రీనివాసరెడ్డి,  జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు
  2. కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ

కోదాడ అక్టోబర్ 16(విజయక్రాంతి): స్వర్ణ భారతి ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో(KITS Women's Engineering College) బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్,  లయన్స్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్,స్వర్ణ భారతి ట్రస్ట్ అధ్యక్షులు నీలా సత్యనారాయణ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నేటి నుండి మూడు రోజులపాటు ఈ శిబిరం ఉంటుందని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  తెలిపారు. ముఖ్యంగా  క్యాన్సర్ ను  మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ నీలా సత్యనారాయణ, స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ, రాజశేఖర్, వెంపటి వెంకటరమణ, పైడిమర్రి సత్య బాబు, యధా సుధాకర్, వంగవీటి రంగారావు, స్వామి శ్రీనివాస్, స్వామి పుల్లయ్య, ఇమ్మడి చక్రి, రవీందర్, బొగ్గారపు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు3.

మరిన్ని వార్తలు