కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్ పథకాలు పేదలకు వరం

06-11-2026 | 08:26pm

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ నవంబర్ 05 (విజయక్రాంతి) : కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్ పథకాలు(Kalyana Lakshmi and Shaadi Mubarak schemes) పేదలకు వరమని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి(MLA Padmavathi Reddy) అన్నారు. శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 219 మందికి మంజూరైన రూ.2.54 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్ చెక్కులను లబ్దిదారులకు(Beneficiaries) పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వివాహ ప్రక్రియ సందర్భంగా పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్ పథకాలు ఆదుకుంటున్నాయన్నారు.

నియోజకవర్గంలో కోదాడ, చిలుకూరు, మునగాల, నడిగూడెం, అనంతగిరి మండలాల్లోని 219 మందికి చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి, ఆర్డీఓ సూర్యనారాయణ, తహశీల్దార్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు