బాప్టిస్ట్ చర్చ్ లో ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు
కోదాడ, అక్టోబర్ 09:(విజయక్రాంతి) : కోదాడ బాప్టిస్ట్ చర్చ్(Kodad Baptist Church) లో పాస్టర్స్ డే వేడుకలు(Pastor Day Celebrated) ఆదివారం ఘనంగా జరిగాయి. సంఘ కాపరి, కోదాడ పట్టణ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్ వంటపాక యేసయ్య , కోదాడ మున్సిపాలిటీ(Kodad Municipality) మాజీ క్రిస్టియన్ కో-ఆప్షన్ సభ్యురాలు వంటపాక జానకి యేసయ్యని సంఘస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సంఘ కాపరి సంఘస్తుల ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నిరంతరం ప్రార్థించేవారని, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు నిత్యం శ్రమిస్తూ సంఘాన్ని నిర్మించి సమాజంలో ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దే గొప్ప సేవకుడని కొనియాడారు.
అంతేకాకుండా, తమకు ఎదురయ్యే కష్టనష్టాలను, వ్యతిరేకతలను, ప్రతికూల పరిస్థితులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటూ సంఘాన్ని ముందుకు నడిపించే గొప్ప యోధుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి బాబు, సంఘ పెద్దలు బల్లికొండ కోటయ్య జాన్, జగ్గు నాయక్, మోజస్, రాంబాబు, గురునాథ్, విజయ్ ఏనుష్, స్రవంతి, శార, అరుణ, సునీత తదితరులు పాల్గొన్నారు.