ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
ఎస్సై ప్రవీణ్
మఠంపల్లి అక్టోబర్ 18(విజయక్రాంతి) : దసరా పండుగను(Dasara Festival) పురస్కరించుకుని మఠంపల్లి పోలీసుల(Mathampally Police) ఆధ్వర్యంలో కృష్ణ తండా గ్రామంలో గ్రామ పెద్దలతో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) మాట్లాడుతూ పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని,గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు(Law and order) విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. పండుగ సమయంలో గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి శంకర్ నాయక్, వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.