కోదాడ రూరల్ సీఐ రామకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు
కోదాడ అక్టోబర్ 16(విజయక్రాంతి) : కోదాడ రూరల్ సీఐగా(Kodad Rural CI) నూతనంగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారెడ్డిని(Ramakrishna Reddy) మండల ఉపాధ్యక్షుడు జిల్లా సీతారాంరెడ్డి, పీఎస్ఎస్ చైర్మన్ సుభాష్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో ఆయన ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఇర్లా సీతారాంరెడ్డి, యర్రవరం పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొప్పుల సుభాష్ రెడ్డి, భీక్యా తండ గ్రామ శాఖ అధ్యక్షుడు బాణోతు నాన్ రాజ్, గణపవరం వార్డు సభ్యుడు నాగిరెడ్డి పాల్గొన్నారు.